ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 5 November 2014

కవిత:ఎవరు నీవు?

మూర్తివి నీవు
స్పూర్తివి నీవు
ప్రణయానికి రాగాలద్దే కోకిలవి నీవు
కలతవి నీవు
నలతవి నీవు
నెలవులో కొలువున్న దేవతవి నీవు
వేదానివి నీవు 
నాదానివి నీవు
వలపు అంబుధిలో ప్రేమామృతానివి నీవు
తలపువి నీవు
మలువుపి నీవు
బ్రతుకు మజిలీలో గెలుపువి నీవు
క్రతువువి నీవు
బ్రతుకువి నీవు
కష్టించే తీరుకి ప్రతిమవి నీవు
శాస్త్రం నీవు
సస్త్రం నీవు
శ్వాసని శాసించే ఆత్మీయతవి నీవు
పలుకువి నీవు
పిలుపువి నీవు
పిల్లనగ్రోవిరవళికి నర్తించే రాధవి నీవు
అందమైన అనుభవాల సుమమాలవా నీవు
సరాగాల సంతోషాల విరిబాలవా నీవు
ఆనందగగనాల కురిసే ప్రణయముత్యపు వానలే నీవు
సర్వం నీవు సత్యం నీవు నిత్యం నీవు యోగం నీవు 

No comments: