ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 5 November 2014

మిత్రులారా..హాయ్
.............
1) మనసనే పరిమళ సుగంధాన్ని బిరడా మూసి ఉంచితే ఆ పరిమళ సువాసనలు ఎలా విస్తరిస్తాయి జనాలకు ఎలా తెలుస్తాయి..ఊరికూరికే లేక అస్తమాను తెరిచేస్తే సువాసనాలు మటుమాయమవుతాయి. నీ మనసుని మదిని సృశించి శాసించే వారికి అరుదుగా కానీ తెలివిగా వాడి వారిపై మనసు పరిమళాన్ని చిలకరించు..
2) కాలం మరిపించు గాయాల్ని, చేదు జ్ఞాపకాలని మానిపించు మరలాగే కొన్ని మధుర జ్ఞాపకాలు కాలాన్నే మరిపిస్తాయి, హృదయాన్ని మురిపిస్తాయి..
3) తోటలోని రోజాపువ్వై విరిసి మెరవాలంటే..ముళ్ళతో సావాసం అలవర్చుకోవాలి అలాగే ముళ్ళలాంటి కష్టాలే జీవితంలోని నీ మెరుపుకు ఎదుగుదలకు దోహదమవుతాయి.

No comments: