ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 17 November 2014

కవిత:మానవత్వపు శోషణ/విశ్లేషణ

జీవనమంతా సమస్యలు బ్రతుకంతా అలుపెరగని పోరాటం
భవితంతా ఒడిదొడుకులు గుంజాటలు ఆరనిచితిమంటలమయం
మానవతవాదాన్ని మరిచి హోరేతెత్తున్న మదోన్మాదం మతోన్మాదం
మతం పేరుతో మాలాల వంటి బాలికల పైన జరిగే దాడులు
మతోన్మాదంలో రక్తపుటేరులు పారుతున్న గాజా, ఇరాక్ సిరియాలు
నైజీరియాలో బోకోహరామ్ లాంటి మత వర్గాలకు బలైన బాలికలు 

కాశీబృందావనాల వీధుల్లో వదిలివేయబడే బాలవితంతువులు
బుద్దిని చిరునవ్వు మహాత్ముని అహింసాతత్వములు గడిచిన గతం
ప్రేమ అహింస త్యాగల పదాలను మర్చిపోయి మురిసిపోతున్న కాలం
అస్తిత్వాన్ని సహజకరుణను సమతలను కోల్పోయినదీ నేటి సమాజం
హింస అరాచకత్వం కుత్సితం ధనం మతమౌఢ్యం చేయు రాజ్యం
కులగోత్రాలగోలలో కురచై మానవత్వం ఖర్సయ్యింది ప్రయోజకత్వం
వర్ణవైషమ్యాలఘోషలో పైరవీల బాటలో షికారెళ్ళింది సమానత్వం
ఎటుపోతోందీ సహనత్వభావం ఏమవుతోందీ నవభారతనిర్మాణం
ఎదుగుతున్న మస్తిష్కశోభలలో ఎదగని భావాలు ఆగని శోకాలు
ఎదురుచూపుల లోగిళ్ళలో వెలగని దీపాలు పలకని రాగాలు
మాటలపల్లకీలో ఊరేగిస్తారు పలుకుల బెల్లాలను తినిపిస్తారు
వెనకెనుకనే విషాన్ని గుమ్మరిస్తారు నమ్మకాలను కాలరాస్తారు
తెలపకు సుమ్మీ మదిలోని మాటలను నమ్మకు నయవంచకులను
ప్రోగేసుకోకు సుమ్మీ వేదనను కలపకు అనవసరపు బంధాలను
.........

No comments: