ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 17 November 2014

కవిత: బాపు రే పోయినావా

తెలుగు గీత తెల్లబోయింది
కుంచె అంచు వెలవెలబోయింది
బుడుగు అడుగులు ఆగిపోయాయి
పెసునాంబ ముచ్చట్లు సమసిపోయాయి
స్నేహానికి మారుపేరు బాపు రమణల అత్మీయబంధం
నెయ్యాని ఇంటిపేరు సత్తిరాజు ముళ్ళపూడి (వారి) మైత్రీబంధం
చిత్రాలతో చిత్రవిచిత్రాలు తెలిపేతీరు మూగబోయింది 
సినిమాల్లో తెలుగురాష్ట్ర అందాలుచూపే జోరాగిపోయింది
బాపు"రే" వెండితెర వాల్మీకి బాపు నిర్యాణం మదిని స్తబ్దుచేసింది
అయ్యారే ఈ ఆకస్మిక కుదుపుకి సమస్త తెలుగుజాతి కెవ్వుమంది
తీతాలు, అమ్యామ్యాలు, హల్లో హల్లోలు, డిక్కీలో తొంగోబెట్టేస్తామనడాలు
సిఫార్సులతో కాపురాలు నిలవవనడాలు, నాకూ అంటూ మాట సాగడాలు
అదో తుత్తి అంటూ పలకించడాలు, జడ విసుర్లు, సాంప్రదాయ హోయలు
ఒకటేమిటి ఎన్ని గుర్తులో ఎన్ని జ్ఞాపకాలో అంత మనసున బాధావీచికలు
సత్తిరాజు లక్ష్మినారాయణ అనగా బాపు లోటు తెలుగుజాతికి తీరనది తీర్చలేనిది
ముళ్ళపూడి వెంకటరమణ అనగా ముళ్ళపూడి వున్నచోటుకే నిజంగా (స్వర్గమే) వెళ్ళాడన్నది
ఎన్ని తలచినా ఎన్ని చెప్పినా చివరగా తెలిసేది ఒకటే
మంచిని పెంచే మనిషిని మరిచేది ఎప్పటికీ లేనే లేదనీ 

No comments: