ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 5 November 2014

మితృలారా..శుభోదయం అండ్ హాయి..
........................
1) వేదనలో వాదం వద్దు..అనవసరపు రాద్దాంతానికి దారితీస్తుంది..చిరాకు, విసుగు, కోపం సహనమనే గోడ దూకి నీ మనోనిశ్చలత్వాన్ని సవాలు చేసినప్పుడు..దీర్ఘ శ్వాసతో రెండు క్షణాల యోచన యోగించు, నీకు లాభించు.
2) చుట్టూ వున్న వాళ్ళ ప్రవర్తన, తీరు మరియు వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం నియంత్రించలేము, మార్చలేము..కానీ అలవాటు చేసుకోవలసినది, నేర్వవలిసినది ఏమిటంటే అట్టి వారి పట్ల తిరిగి మనం స్పందించే తీరు..అదే మన భవితకు సరియైన బాట వేయు.
3) అభిమానం అనురాగం దారితీయు మరి అనురాగం మోహానికి దారితీయు. అలవిలేని అతి ఏదైనా క్లేశానికి దారితీయు, ప్రేమైన లేక పగైనా..

No comments: