ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 5 November 2014

కవిత:సందేశం

మౌనంగా వుండేవు
ఏమాయేనీవేళ పెదువులేల నిశ్శబ్దమంత్రాలు చదివేనీవేళ
నిస్తేజంగా చూస్తున్నావు
చురుకుచూపు చురకత్తులు అస్త్రసన్యాసం చేసాయేమీవేళ
నెమ్మదిగా నిలుచున్నావు 
ఉరుకులెత్తు వయసమ్మ వేగాలను ఆపిపట్టావేమీవేళ
సందడి చేసే వయసులో అల్లరి చేసే మనసుతో
పరువాల పట్టుకొమ్మ నెమ్మదైతే ఎట్టాగమ్మ
బాధలైనా బాధ్యతలైనా నెరవేర్చు పద్దతిగా
నిన్న తలచి నేడు వగచి రేపుని పాడుచేసుకోకుగా 

No comments: