ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 16 November 2014

కవిత: నిజనిష్టూరాలు

రవికాంతుని ప్రభలతో
జగమంతా వెలిగేనులే
కలువరేడు నవ్వులతో
నిశీదేవి పరవశించులే
వలపుల ముంగిళ్ళలో
మరులు మత్తివ్వునులే
తప్పోప్పుల లోగిళ్ళలో
తలవంపులు తాకేనులే
పరువాల పలకరింపులతో
యవ్వనసోభలు విరిసేనులే
నడతల నడకలమారితే (తప్పుదారిపట్టితే)
ప్రమోదాలసుఖాలు అటకేక్కులే
విన్నపాల వింజామరలతో
సాధ్యాసాధ్యాలు సాగిలపడులే
మిడిసిపాటు మోహమాటాలతోకాగలకార్యాలు గంగపాలగులే

నవ్వుమోముల సంజ్ఞలతో
సంబరాలు సంతకాలుచేయులే
విషణ్ణవదనాల ప్రదర్శనలతో
కష్టనష్టాలకధలు కంచికెళ్లవులే
వాస్తవవీధుల్లో పయనాలు
విజయాలకు బాటలువేయులే
ఊహాలోకాల విహారాలు (అతిగా)
ఊర్ధ్వలోకాలను ఉత్తినేదర్సింపించులే
సౌమ్యత సచ్చీలతలతో సావాసాలు
నిర్మలమయ జీవితానికి సంకేతాలే
కోపాల దూషణల దుకాణాలు (అవాసాలు)
శాంతిరాహిత్యపు బ్రతుకుకి దర్పణాలే 

No comments: