ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 5 November 2014

మిత్రులారా..హాయ్
............
1) మనసులో కష్టాలు వచ్చినా పెదవిచివర కూడా వాటిని తొణకనీయక ఇబ్బందుల సంద్రాన్ని ఎదురీది కృషితో విజయమనే ఆవలి ఒడ్డుకు చేరగలిగితే స్థిరచిత్తుడు, ప్రజ్ఞవంతుడుగా తెలియబడు..
2) స్వప్నాల్ని చేరదలిచి వాటిని చేరలేకపోతే నీ తీరుతెన్నులు మార్చుకుని మరలా ప్రయత్నం చెయ్యి కానీ నీ ప్రిన్సిపల్స్ ని ఎప్పుడూ మార్చుకోకు..అవసరమైతే వృక్షరాజం నుంచి నీతి నేర్చుకో.. అది తన ఆకులను మారుస్తాయి గాని వేరులను/రూట్స్ ని మార్చుకోవుగా..
3) ఉలిదెబ్బ పడితేనే రాయి శిల్పమగు, కొలిమిలో పడితేనే లోహం ద్రావకమగు..అలాగే కష్టాల బెడద పడితేనే బ్రతుకు చేయు బాగు వైపు పరుగు..

No comments: